కొండపోచమ్మసాగర్ రాష్ట్ర చరిత్రలో ఓ అద్భుతమైన ప్రాజెక్టు: కేసీఆర్

కొండపోచమ్మసాగర్ రాష్ట్ర చరిత్రలో ఓ అద్భుతమైన ప్రాజెక్టు: కేసీఆర్
X

కొండపోచమ్మసాగర్ రాష్ట్ర చరిత్రలో ఓ అద్భుతమైన ప్రాజెక్టు అన్నారు ముఖ్యమంత్రి కేసిఆర్. తెలంగాణ ఇంజినీర్ల ప్రతిభకు ప్రత్యక్ష తార్కాణం కాళేశ్వరం ప్రాజెక్టు అని సిఎం కొనియాడారు. తెలంగాణ ఇంజినీర్లు ఎంత శక్తిమంతులో, నైపుణ్యవంతులో రుజువు చేసిందన్నారు. కాళేశ్వరానికి 4,800 మెగావాట్ల విద్యుత్‌ను వినియోగిస్తున్నామని, పేరున్న కంపెనీలన్నీ ఈ ప్రాజెక్టు కోసం పనిచేశాయని పేర్కొన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కొండ పోచమ్మ సాగర్ నిర్మాణమైందన్నారు కేసిఆర్ అన్నారు. కాళేశ్వరం నుంచి కొండపోచమ్మ వరకు భూములు కోల్పోయిన భూనిర్వాసితుల త్యాగం మరువలేనిదన్నారు. వారికి శిరసు వంచి నమస్కరిస్తున్నామన్నారు. వారి త్యాగం వల్లే లక్షలాది ఎకరాలు సాగులోకి వచ్చాయన్నారు. నిర్వాసితుల త్యాగాలు వెలకట్టలేనివని ముఖ్యమంత్రి కొనియాడారు. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు అతి పెద్దదన్నారు ముఖ్యమంత్రి కేసిఆర్. మల్లన్న సాగర్‌ ప్రాజెక్టు రాష్ట్రంలో రెండో అతిపెద్ద ప్రాజెక్టు అని సీఎం వెల్లడించారు. 165 టీఎంసీల కెపాసిటీతో ఈ రిజర్వాయర్‌లు నిర్మిస్తున్నామన్నారు. ఇంత పెద్ద ప్రాజెక్టులను ఏ రాష్ట్రం కూడా నిర్మించలేదన్నారు. మూడు నాలుగేళ్లలోనే ఈ ప్రాజెక్టులను పూర్తి చేశామని వెల్లడించారు. లక్ష కోట్ల రూపాయల పంటను తెలంగాణ రైతాంగం పండించబోతోందన్నారు. దేశంలో 83 లక్షల టన్నుల వరి ధాన్యం సేకరిస్తే.. 53 లక్షలు తెలంగాణ రాష్ట్రం దేశానికి ఇచ్చిందన్నారు.

Tags

Next Story