కొండపోచమ్మ రిజర్వాయర్ లో గోదారమ్మ పరవళ్లు

కొండపోచమ్మ రిజర్వాయర్ లో గోదారమ్మ పరవళ్లు

తెలంగాణలో మరో జలదృశ్యం సాక్షాత్కరమైంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొండపోచమ్మ ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసిఆర్, త్రిదండి చినజీయర్ స్వామితో కలిసి వేదమంత్రోచ్చరణలమధ్య ప్రారంభించారు. ఐదు జిల్లాలోని 2 లక్షల 85 వేల ఎకరాలకు సాగు నీరు అందించే అద్భుత ఘట్టంతో ఆ ప్రాంతంలో పండగ వాతావరణం నెలకొంది. ప్రారంభోత్సవానికి ముందు కేసిఆర్ కొండపోచమ్మ ఆలయంలో అమ్మవారినిదర్శించుకున్నారు. ఆ అక్కడ గోపూజ, చండీహోమం, పూర్ణాహుతిలో సతీ సమేతంగా సిఎం పాల్గొన్నారు. అనంతరం మర్కుక్ పంప్ హౌజ్ వద్ద చేరుకొని త్రిదండి చినజీయర్ స్వామితో కలిసి సుదర్శన యాగంలో పాల్గొన్నారు. ఈ యాగంలో మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డిలతోపాటు పలువురుమంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పూజాది కార్యక్రమాల వేదమంత్రోచ్చరణలమధ్య స్వామిజీతో కలిసి రిజర్వాయర్ పంప్ హౌజ్ ను కేసిఆర్ ప్రారంభించారు.

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో 14వ ప్యాకేజీలో భాగంగా 15 టీఎంసీల సామర్ధ్యంతో కొండ పోచమ్మ రిజర్వాయర్ నిర్మాణం పూర్తయ్యింది. సముద్ర మట్టానికి దాదాపు అరకిలోమీటర్ ఎత్తు వరకు గోదారి జలాలను తీసుకెళ్లి అక్కడి నుంచి కాలువల ద్వారా సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి జిల్లాల్లోని లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అతి ఎత్తయిన ప్రాంతం ఇదే. మేడిగడ్డ నుంచి వచ్చే జలాలు దాదాపు 518 మీటర్లు మేర పైకి నీటిని పంపిస్తారు.

Tags

Read MoreRead Less
Next Story