నిందితుడి మెడపై గట్టిగా మోకాలితో నొక్కి.. అత్యంత క్రూరంగా ప్రవర్తించిన పోలీస్

నిందితుడి మెడపై గట్టిగా మోకాలితో నొక్కి.. అత్యంత క్రూరంగా ప్రవర్తించిన పోలీస్

అమెరికాలోని మిన్నియాపోలిస్ నగరంలో అశాంతి నెలకొంది. ఒక నల్లజాతి నిందితుడు పోలీసు చేతిలో ప్రాణాలు కోల్పోవడంతో ఓ వర్గం భగ్గుమంది. పెద్ద భవంతులకు సైతం నిప్పు పెట్టారు. వాహనాలు తగులబెట్టారు. పోలీసులు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించినా కుదర్లేదు. ఆందోళనకారులు శాంతించాలని ట్రంప్ విజ్ఞప్తి చేశారు.

సోమవారం చోటు చేసుకున్న ఈ దుర్ఘటన అమెరికాలో వైరల్‌గా మారింది. మిన్నియాపొలిస్ తగలబడేందుకు కారణమైంది. ఇప్పుడా నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సోమవారం రోజున .. జార్జ్‌ ఫ్లాయిడ్‌ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే.. ఒక పోలీసు అతని మెడపై గట్టిగా మోకాలితో నొక్కి పట్టాడు. దీంతో.. అతనికి ఊపిరాడలేదు. ఊపిరాడడం లేదు.. వదలండని గట్టిగా అరుస్తూ ఫ్లాయిడ్‌ వేడుకున్నా.. పోలీసు కనికరం చూపలేదు. అత్యంత క్రూరంగా ప్రవర్తించారు. ఈ ఘటనలో జార్జ్‌ ఫ్లాయిడ్‌ చనిపోయాడు.

అయితే.. జార్జ్‌ ఫ్లాయిడ్‌ నల్లవాడు కావడం.. అతని మెడపై కాలు పెట్టి నొక్కి చంపిన పోలీసు తెల్లవాడు కావడం రచ్చ రాజేసింది. బ్లాక్స్‌ అంతా ఆగ్రహంతో రగిలిపోయారు. మరో మాటలో చెప్పాలంటే.. మిన్నియాపొలిస్ నగరానికి నిప్పుపెట్టారు. నిజానికి సోమవారం నాడు ఫ్లాయిడ్‌ చనిపోయాడు. మంగళవారం రోజు ఘటనాస్థలంలో నిరసన కార్యక్రమం చేపట్టాలని ఆందోళనకారులు నిర్ణయించారు. అయితే.. అమెరికాలో కరోనా వైరస్‌ మరణ మృదంగం మోగిస్తున్న తరుణంలో.. భౌతిక దూరం పాటిస్తూ ఆందోళన కొనసాగించారు. అయితే.. కాసేపటికే పరిస్థితి అదుపు తప్పింది.

పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు ఆందోళనకారులు నినాదాలు చేశారు. జాతి వివక్ష ఇంకెన్నాళ్లు అంటూ నినదించారు. ఫ్లాయిడ్ చావుకు కారణమైన పోలీసులు పనిచేసే కార్యాలయంవైపు పరుగులు తీయడంతో పరిస్థితి అదుపు తప్పింది. బుధవారం నాటికి ఆందోళనకారుల సంఖ్య వందల నుంచి వేలకు చేరింది. వాళ్ల ఆగ్రహావేశాలకు పెద్ద పెద్ద భవంతులే బూడిదగా మారిపోయాయి. పలు వాణిజ్య సముదాయాలు ధ్వంసం అయ్యాయి. ఆందోళనకారుల ముసుగులో కొందరు లూటీ చేశారు. పలు వాహనాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు అన్ని ప్రయత్నాలూ చేశారు. వాటర్‌ కేనన్లు, టియర్ గ్యాస్‌ ప్రయోగించారు. ఎంతకీ కంట్రోల్ కాకపోవడంతో నేషనల్‌ గార్డ్స్‌ రంగంలోకి దిగాల్సి వచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story