బిగ్ బ్రేకింగ్.. ఎస్ఈసీగా నిమ్మగడ్డనే కొనసాగించాలని హైకోర్టు తీర్పు

X
ఎస్ఈసీగా మాజీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ నే కొనసాగించాలని ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. నిమ్మగడ్డను తొలగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ ను హైకోర్టు కొట్టివేసింది. అంతేకాదు ఆర్టికల్ 213 ప్రకారం ఆర్డినెన్స్ తెచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని కూడా ధర్మాసనం స్పష్టతనిచ్చింది. అలాగే ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డనే కొనసాగించాలని, ఆయన్ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ మళ్లీ ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించేందుకు లైన్ క్లియర్ అయినట్లు అయ్యింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
