మీకు ఓకే అయితే మీ సమస్యను నేను పరిష్కరిస్తా: ట్రంప్

మీకు ఓకే అయితే మీ సమస్యను నేను పరిష్కరిస్తా: ట్రంప్

సరిహద్దు వివాదంతో సమస్యలు సృష్టించుకునే బదులు పరిష్కరించుకుంటే మంచిదేమో. అవసరమైతే మీ మద్య నెలకొన్న సమస్యని పరిష్కరించడానికి నేను మధ్య వర్తిత్వం వహిస్తా అంటూ అగ్రరాజ్య అధినేత ట్రంప్ భారత్, చైనాలు ఉద్దేశించి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు దేశాలు అత్యధిక జనాభా కలిగిన దేశాలు. జనాభాతో పాటు అత్యంత శక్తివంతమైన సైనిక వ్యవస్థలు కూడా కలిగి ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితులపై రెండు దేశాలు సంతృప్తికరంగా లేవని భావిస్తున్నాను.

చైనా తీరుపై భారత ప్రధాని మోదీ అసంతప్తితో ఉన్నట్లు వ్యక్తమవుతోంది అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే ట్రంప్ సలహాలను మేం తీసుకోబోమని, ఇతరుల జోక్యం అవసరం లేదని భారత్ తేల్చిచెబుతోంది. మరోపక్క చైనా కూడా ఇదే అభిప్రాయంతో ఉంది. సరిహద్దు వివాదాన్ని శాంతియుతంగానే ఇరువురం పరిష్కరించుకుంటామని భారత్ గురువారం స్పష్టం చేసింది. ఇదే విషయమై చైనాతో చర్చలు జరుపుతున్నామని భారత్ తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story