మున్సిపాలిటీలో నూటికి నూరుశాతం పన్నులు వసూలు చేయాలి : అరవింద్‌

మున్సిపాలిటీలో నూటికి నూరుశాతం పన్నులు వసూలు చేయాలి : అరవింద్‌

తెలంగాణలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో జూన్‌ 1 నుంచి 8వ తేదీ వరకు పట్టణప్రగతి కార్యక్రమం నిర్వహించాలని పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. పట్టణప్రగతి కార్యక్రమంపై అదనపు కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లు, పట్టణప్రణాళిక, మెప్మా అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వర్షాకాలాన్ని దృష్టిలోపెట్టుకుని పట్టణాల్లో పనులు చేపట్టాలని సూచించారు. సీజనల్‌ వ్యాధులు, దోమల వ్యాప్తిని సమర్థంగా ఎదుర్కోవాలని ఆదేశించారు. హరితహారం కార్యక్రమాన్నికూడా దృష్టిలో పెట్టుకోవాలన్నారు. మున్సిపాలిటిలో నూటికి నూరుశాతం పన్నులు వసూలు చేయాలన్నారు.

పచ్చదనానికి పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇందు కోసం ప్రజా ప్రతినిధులు, అధికారులతో పాటు ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేస్తోంది. ఇప్పటికే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను విజయవంతం అమలు చేస్తోంది. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలపాటు పరిశుభ్రత కార్యక్రమానికి సైతం విశేష స్పందన లభిస్తోంది. దీంతో మరోసారి పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం.

Tags

Next Story