చెట్టుకిందే సెలూన్.. పీపీఈ కిట్ ధరించి మరీ కటింగ్

చెట్టుకిందే సెలూన్.. పీపీఈ కిట్ ధరించి మరీ కటింగ్
X

లాక్డౌన్ 4.0లో కొన్ని సడలింపులతో సెలూన్ షాపులు తెరుచుకున్నాయి. దీంతో హర్యానాలోని ఇద్దరు అన్నదమ్ములు చెట్టుకిందే కస్టమర్లకు కటింగ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను పాటించడంతో పాటు తాము మరింత ముందు జాగ్రత్తగా పీపీఈ కిట్లు కూడా ధరించామని చెబుతున్నారు. 20 ఏళ్లుగా ఇక్కడే బార్బర్ షాపును నిర్వహిస్తున్నామని అన్నారు. కస్టమర్ల శ్రేయస్సే మాకర్తవ్యం అందుకే పీపీఈ కిట్, ఫేస్ షీల్డ్ పెట్టుకుని హెయిర్ కటింగ్ చేస్తున్నామని చెప్పారు.

జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఉన్న కస్టమర్లు వస్తే వారిని అనుమతించమని అన్నారు. ఇక కస్టమర్‌కి కటింగ్ చేసిన వెంటనే దుకాణంలోని అన్ని పరికరాలను శుభ్రపరుస్తామని చెప్పారు. వారికి వాడే టవల్ కూడా టిస్యూ పేపర్‌తో తయారు చేయబడింది. కాబట్టి ఒకరికి వాడగానే దానిని పడేయడం జరుగుతుందని అన్నారు. కస్టమర్ మాస్క్ కచ్చితంగా పెట్టుకోవాలి. లేకపోతే వారికి కటింగ్ చేయబడదు. కటింగ్ చేయించుకునే ముందు చేసిన తరువాత శానిటైజర్‌తో చేతులు శుభ్రపరుచుకుంటున్నారు.

Tags

Next Story