డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐ ఎఫ్ఐఆర్

డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐ ఎఫ్ఐఆర్
X

హైకోర్టు ఆదేశాల మేరకు డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐ విచారణ ప్రారంభమైంది.. ఇందుకు సంబంధించి సీబీఐ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసింది. ఐపీసీ 120 బి, 324 , 343, 379 అండ్ 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. మరోవైపు హైకోర్టు ఆదేశాలతో లోతుగా దర్యాప్తు చేసేందుకు సీబీఐ అధికారులు సిద్ధమయ్యారు..

విశాఖలోని ప్రభుత్వ మానసిక వైద్యశాలకు చేరుకున్న సీబీఐ అధికారులు డాక్టర్‌ సుధాకర్‌ వాంగ్మూలాన్ని సీబీఐ అధికారులు తీసుకోనున్నారు.. కాగా ఈ కేసులో గుర్తుతెలియని పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులపై సీబీఐ కేసులు నమోదు చేసింది.

Tags

Next Story