దక్షిణాఫ్రికాలో మొదటిసారిగా పెరిగిన కరోనా కేసులు.. బ్రెజిల్ లో చూస్తే..

దక్షిణాఫ్రికాలో మార్చిలో సంక్రమణ మొదటి కేసు నమోదైంది. అప్పటి నుండి, మొదటిసారిగా శుక్రవారం 1800 కు పైగా కొత్త కేసులు కొత్త కేసులు వచ్చాయి.. గత 24 గంటల్లో 1837 కరోనా కేసులు వచ్చినట్లు ఆరోగ్య శాఖ అధికారులు నివేదించారు. తాజా కేసులతో దక్షిణాఫ్రికాలో కరోనా సోకిన వారి సంఖ్య 29 వేల 240 కి పెరిగింది. అలాగే గత 24 గంటల్లో 34 మంది మరణించారు. దీంతో దేశంలో మరణించిన వారి సంఖ్య 611 చేరుకుంది. ఇప్పటివరకు ఇక్కడ 15 వేల 93 మందికి నయం కావడంతో ఆసుపత్రినుంచి డిశ్చార్జ్ అయ్యారు.
మరోవైపు దేశంలో 24 గంటల్లో 24 వేల 452 పరీక్షలు జరిగాయని.. మొత్తం మీద 6 లక్షలకు పైగా 80 వేల పరీక్షలు చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఇక అమెరికా తరువాత అత్యధికంగా ప్రభావితం అయిన బ్రెజిల్లో ఒకే రోజులో 1,124 మంది మరణించారు. దీంతో ఇప్పటివరకూ 27 వేల 944 మంది మరణించారు. ఇక్కడ రోగుల సంఖ్య 4.68 లక్షలకు పైగా ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com