డాక్టర్ సుధాకర్ పిల్‌పై ఏపీ హైకోర్టులో విచారణ

మాస్క్‌లు లేవని ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే డాక్టర్ సుధాకర్ పాలిట శాపమైందా. విశాఖ మానసిక వైద్యాలయంలో ఆయన్ను ట్రీట్‌మెంట్ పేరుతో చిత్రవధ చేస్తున్నారా. తాజా పరిణామాలు చూస్తుంటే అలానే అనిపిస్తోందని కుటుంబ సభ్యులు, విపక్ష నేతలు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. మరోవైపు.. సుధాకర్‌ను అక్కడి నుంచి వేరే ఆసుపత్రికి తరలించాలని న్యాయవాది శ్రవణ్ దాఖలు చేసిన వ్యాజ్యంపై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. సుధాకర్ పోలీస్ కస్టడీలో ఉన్నారా... లేదా జ్యుడీషియల్ కస్టడీలోఉన్నారా అంటూ ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలని కోరింది. అయితే సుధాకర్ ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదని.. మెరుగైన వైద్యం అందిస్తున్నారని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. సుధాకర్ ఆరోగ్యంపై పూర్తి నివేదిక ఇవ్వాలని కోర్టు కోరగా.. న్యాయవాది 2 రోజులు సమయం అడిగారు. అయితే.. ఈ 2 రోజుల్లో సుధాకర్ ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని నమ్మకం ఏమిటని కోర్టు ప్రశ్నించింది.
మానసిక వైద్యశాలలో తన కొడుక్కి ప్రాణహాని ఉందని అన్నారు డాక్టర్ సుధాకర్ తల్లి కావేరి బాయి. ట్రీట్మెంట్ పేరుతో డాక్టర్ రామిరెడ్డి తన కొడుక్కి అనవసరమైన మాత్రలు ఇచ్చి చికాకు పుట్టిస్తున్నారని ఆరోపించారు. తన కొడుకుని వేరే చోటికి తరలించాలని కోరారు.
డాక్టర్ సుధాకర్‌ను ఆసుపత్రిలో కలిశారు టీడీపీ నేతలు. డాక్టర్ రామిరెడ్డి వల్లే ఇబ్బంది ఉందని డాక్టర్ సుధాకర్ అంటున్నారని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు.
సుధాకర్‌ను ట్రీట్ చేస్తున్న డాక్టర్ రామిరెడ్డి.. వైసీపీ కార్యకర్తగా మాట్లాడుతున్నారని... దళితనాయుడు పుచ్చా విజయ్‌కుమార్ అన్నారు. దళితులను అణగదొక్కే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
ఎమ్మెల్యేల బలం ఉంది కాబట్టి ఏం చేసినా చెల్లుతుందనే ధోరణిలో వైసీపీ ప్రభుత్వం వెళ్తోందని దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కోర్టు జోక్యంతో సుధాకర్‌కు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com