హైదరాబాద్‌లో కంటోన్మెంట్‌జోన్‌లలో ఐసీఎంఆర్ ఇంటింట సర్వే

తెలంగాణలో కరోనా విజృంభిస్తుంది. గత రెండురోజుల నుంచి రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిదిలోనే ఎక్కువగా ఉన్నాయి. దీంతో కరోనాపై ఐసీఎంఆర్ హైరదబాద్ లో సర్వే నిర్వహించనుంది.
హైదరాబాద్‌లోని ఐదు కంటైన్మెంట్ జోన్లలో శనివారం, ఆదివారం జాతీయ పౌష్టికాహార సంస్థ టీమ్స్ అధ్వర్యంలో సర్వే జరగనుంది. ఆదిభట్ల, బాలాపూర్, మియాపూర్, చందానగర్, టప్పా చబుత్రా కంటైన్మెంట్ జోన్లలో సర్వే జరపనున్నారు. ఒక్కో జోన్ లో రెండు టీంలు చొప్పున మొత్తం పది టీంలు కరోనా కేసులపై .. వాటి లక్షణాలపై.. లక్షణాలు లేకుండా బయటపుడుతున్న కేసులపై సర్వే చేస్తారు. సర్వే చేసిన నివేదికను ఐసీఎంఆర్.. కేంద్ర ఆరోగ్యశాఖకు అందిస్తుంది. ఐసీఎంఆర్ చేస్తున్న ఈ సర్వేల నివేదికల ఆధారంగా కేంద్రం లాక్ డౌన్ పొడిగింపుపై నిర్ణయం తీసుకుంటుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com