ఇకపై పెట్రోల్ కూడా డోర్ డెలివరీ

ఇకపై పెట్రోల్ కూడా డోర్ డెలివరీ
X

పెట్రోల్, సీఎన్‌జీలను డోర్ డెలివరీ చేసేందుకు ఆయిల్ కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఇప్పటికే డీజిల్ ను ఇంటివద్దకే అందిస్తున్న కంపెనీలు.. లాక్‌డౌన్ సమయంలో పెట్రోల్, సీఎన్‌జీలను అందించేందుకు ఆయిల్ కంపెనీలు ప్రతిపాదన చేశాయని.. దానికి కేంద్రం పచ్చజెండా ఊపిందని ధర్మేంద్ర ప్రధాన్ పేర్కోన్నారు. దేశంలో లాక్ డౌన్ వలన ఇందన డిమాండ్, వినియోగం తగ్గిందని.. రతన్ టాటా ఆధ్వర్యంలో ఇండియన్ స్టార్టప్ కంపెనీ రిపోస్ ఎనర్జీ కంపెనీ మొబైల్ పెట్రోల్ పంపుల ద్వార ఇంటివద్దనే పెట్రోలు డెలివరీ చేస్తాయని మంత్రి వివరించారు.

Tags

Next Story