ఒంటె పాలు లీటర్ రూ.600లు.. ఎందుకంత రేటు..

ఒంటె పాలు లీటర్ రూ.600లు.. ఎందుకంత రేటు..

వలస కార్మికులు లాక్డౌన్ కారణంగా పని లేక వారి స్వస్థలాలకు తరలిపోతుంటే రాజస్థాన్‌కి చెందిన కొందరు మాత్రం ఒంటెలను తీసుకుని నగరానికి వచ్చారు. ఒంటెలే వారి జీవనాధారం. ఒంటె పాలు లీటర్ రూ.600కు విక్రయిస్తున్నారు. తద్వారా వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తున్నారు. ఈ ఒంటె పాల ఉపయోగం ఏంటని ఆరా తీస్తే బుద్ది మాంద్యంతో బాధపడుతున్న చిన్నారులకు ఒంటె పాలు తాగిస్తే బుద్ధి వికసిస్తుందని జాతీయ ఒంటెల కేంద్రం డైరెక్టర్ డాక్టర్ కె.ఎమ్.ఎల్.పాఠక్ అన్నారు. ఇజ్రాయెల్‌లో జరిపిన పరిశోధనల ప్రకారం ఆవు, గేదె పాలతో సమస్య తలెత్తే పిల్లలకు ఒంటె పాలు ఇస్తే అలెర్జీ తొలగిపోతుందని తెలిపారు.

ఒంటెపాలు అధిక మొత్తంలో విటమిన్లు, ఖనిజలవణాలను అందిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. పోషకాలు సమృద్ధిగా ఉండడంతో పాటు కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. ఒంటె పాలు రక్తంలో చక్కెరను తగ్గిస్తుందని మరియు టైప్ 1 మరియు టైప్ 2 డయాబెటిస్ రెండింటిలోనూ ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరుస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలను అందించే ప్రోటీన్లను కలిగి ఉంటుంది. ఇది యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఒంటె పాలలో ఇన్ని గుణాలు ఉన్నందునే అంత రేటు పలుకుతుందని రాజస్థాన్ వాసుల అభిప్రాయం. అయితే ఎవరికి వారు సొంత నిర్ణయం తీసుకోకుండా డాక్టర్ సలహా మేరకే ఏదైనా వాడవలసి ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story