చల్లటివార్త : కేరళ తీరాన్ని తాకిన రుతుపవనాలు

చల్లటివార్త : కేరళ తీరాన్ని తాకిన రుతుపవనాలు
X

దేశానికీ చల్లటి వార్త వెలువడింది. రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకినట్లు ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ పేర్కొంది. భారత వాతావరణ శాఖ (ఐఎండి) అంచనా కంటే రెండు రోజుల ముందుగానే రుతుపవనాలు కేరళకు చేరుకున్నాయి. జూన్ 1 న రుతుపవనాల రాక గురించి IMD రెండు రోజుల కిందట ప్రకటన చేసింది. ఈసారి రుతుపవనాలు సగటున ఉండబోతున్నాయని వాతావరణ శాఖ ఏప్రిల్‌లో తెలిపింది. ఈసారి 96 నుండి 100% వర్షపాతం నమోదైతే సాధారణ రుతుపవనాలుగా పరిగణించబడుతుంది. గతేడాది ఎనిమిది రోజుల ఆలస్యంతో జూన్ 8 న కేరళ తీరాన్ని తాకాయి.. జూన్ , సెప్టెంబర్ మధ్య నైరుతి రుతుపవనాల ద్వారా భారతదేశంలో వర్షాలు కురుస్తాయి.

Tags

Next Story