తెలంగాణలో స్కూళ్లు తెరిచేది ఎప్పుడంటే..?

తెలంగాణలో స్కూళ్లు తెరిచేది ఎప్పుడంటే..?

తెలంగాణలో కరోనా విజృంభణ నేపథ్యంలో విద్యాశాఖ ఆచితూచి అడుగులు వేస్తోంది. పాఠశాలలను దశలవారిగా తెరవాలని విద్యాశాఖ యోచిస్తోంది. జులై 5వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో.. ఆ తరువాతే స్కూళ్లు తెరవాలని విద్యాశాఖ భావిస్తోంది.. ఒకేసారి కాకుండా మొదట 8, 9, 10 విద్యార్థులకు తరగతులు ప్రారంభించాలని భావిస్తోంది.. మొదట కొద్ది రోజులు ఉపాధ్యాయులు విధులుకు హాజరై పాఠశాలలను సన్నద్ధం చేసేలా చర్యలు తీసుకుంటారు. ముఖ్యంగా నీటి వసతి, మరుగుదొడ్లు, ఫర్నిచర్‌, తదితర సౌకర్యాలను సిద్ధం చేయాల్సి ఉంటుంది. ప్రాథమిక పాఠశాలలను మాత్రం ఆలస్యంగా తెరవాలని విద్యాశాఖ భావిస్తోంది.

Tags

Next Story