పిడుగుపాటుకు గురై ఓ వ్యక్తి మృతి

పిడుగుపాటుకు గురై ఓ వ్యక్తి మృతి
X

అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం తెలికి గ్రామంలో.. పిడుగుపాటుకు గురై ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. తెలికి గ్రామంలో ఆదివారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో పొలం పనులు చేసుకుంటున్న కృష్ణమూర్తి అనే వ్యక్తి.. తాడిచెట్టు కిందకి వెళ్లాడు. అయితే, తాడిచెట్టుపై పిడుగు పడటంతో కృష్ణమూర్తి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. గమనించిన స్థానికులకు కృష్ణమూర్తిని పామిడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, కృష్ణమూర్తి అప్పటికే మృతిచెందినట్టు డాక్టర్లు ప్రకటించారు. కృష్ణమూర్తి అకాలమరణంతో తెలికి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పిడుగుపాటు ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story