ఓ బిల్డింగ్ వివాదంలో బెజవాడలో కత్తులతో వీరంగం

ఓ బిల్డింగ్ వివాదంలో బెజవాడలో కత్తులతో వీరంగం
X

బెజవాడలో కత్తులతో వీరంగం సృష్టించాయి పాత నేరస్థుల గ్యాంగులు. పటమటలో తోట సందీప్, పండు అనే పాత నేరస్థులు ఘర్షణకు దిగారు. కత్తులు, కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. కొందరికి కత్తిపోట్లు అయ్యాయి. దాడుల్లో గాయపడిన వారు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. రెండు గ్రూపులు కత్తులతో వీరంగం సృష్టించడంతో బెజవాడ వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

ఓ బిల్డింగ్‌ వివాదంలో ఇరువర్గాల మధ్య ఆధిపత్య పోరు కారణంగా.. ఈ గొడవ జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే సందీప్‌పై 13 కేసులు, పండుపై 3 కేసులున్నాయని, ఇరువర్గాలను అదుపులో తీసుకున్నట్లు వెల్లడించారు పోలీసులు.

Tags

Next Story