తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు .. ఒక్కరోజే..

తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు .. ఒక్కరోజే..

తెలంగాణలో రోజురోజుకూ కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. అత్యధికంగా ఆదివారం 199 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 2 వేల 698కి చేరింది. GHMC పరిథిలో 122, రంగారెడ్డి జిల్లాలో 40 కేసులు నమోదయ్యాయి. మేడ్చల్‌లో 10, ఖమ్మంలో 10 కరోనా కేసులు..మహబూబ్‌నగర్‌, జగిత్యాల, మెదక్‌లో 3 చొప్పుల కేసులు నమోదయ్యాయి. వరంగల్ అర్బన్‌లో 2, సూర్యాపేట, నిర్మల్, యాదాద్రి, జనగాంలో ఒక్కో కేసుతో పాటు.. ముగ్గురు వలస కార్మికులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అటు.. తెలంగాణలో ఇవాళ ఐదుగురు మృతి చెందారు. దీంతో.. మృతుల సంఖ్య 82కు చేరింది.

Tags

Read MoreRead Less
Next Story