ఐసీఎంఆర్‌ శాస్త్రవేత్తకు కరోనా పాజిటివ్‌

ఐసీఎంఆర్‌ శాస్త్రవేత్తకు కరోనా పాజిటివ్‌
X

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) లోని సీనియర్ శాస్త్రవేత్త ఒకరికి కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. ముంబైకి చెందిన శాస్త్రవేత్త కొద్ది రోజుల క్రితం ఢిల్లీకి వచ్చారు.. అయితే ఆయనకు ఆదివారం ఉదయం పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని వచ్చింది. ఈ శాస్త్రవేత్త ముంబైలోని ఐసిఎంఆర్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ రిప్రొడక్టివ్ హెల్త్ నుండి వచ్చినట్లు వార్తా సంస్థ పిటిఐ నివేదించింది. దీంతో ఢిల్లీలోని ఐసిఎంఆర్ భవనాన్ని మూసి వేసి శానిటైజ్ చేశారు. కార్యాలయం మూతపడటంతో ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేసే వెసులుబాటు కల్పించారు. కాగా సదరు శాస్త్రవేత్త COVID-19 కోర్ బృందంలో ఒకరుగా ఉన్నారు. గత వారం ICMR చీఫ్ డాక్టర్ బలరామ్ భార్గవతో సమావేశం కోసం ఢిల్లీకి వచ్చారు.

Tags

Next Story