కృష్ణా జలాల వినియోగంపై తెలంగాణ బీజేపీ ప్రత్యేక సమావేశం

కృష్ణా జలాల వినియోగంపై తెలంగాణ బీజేపీ ప్రత్యేక సమావేశం
X

కృష్ణా జలాల వినియోగం విషయంలో ప్రభుత్వం మరింత సమర్థవంతమైన ప్రాణాళికతో ముందుకు వెళ్లాలని BJP నేతలు, సాగునీటి రంగ నిపుణులు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లోని BJP కార్యాలయంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం వాడివేడిగా జరిగింది. ఏపీ ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న ప్రాజెక్టులు, తెలంగాణ అనుసరించాల్సిన వ్యూహాలు వంటి వాటిపై ప్రధానంగా చర్చ జరిగింది. నదీ జలాల వాడకం విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు అవసరమైతే ప్రత్యక్ష పోరాటాలు చేపట్టాలని నిర్ణయించారు. వెదిరె శ్రీరామ్ లాంటి నిపుణులు కూడా భవిష్యత్ కార్యాచరణపై కొన్ని సూచనలు చేశారు.

Tags

Next Story