ఆన్‌లైన్ తరగతులు మిస్ అవుతున్నానంటూ.. విద్యార్థిని ఆత్మహత్య

ఆన్‌లైన్ తరగతులు మిస్ అవుతున్నానంటూ.. విద్యార్థిని ఆత్మహత్య
X

ఆన్‌లైన్ తరగతులు వినడానికి సౌలభ్యం లేకపోవడంతో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. కేరళలో సోమవారం నుండి ఆన్‌లైన్ తరగతులతో కొత్త విద్యా సెషన్ ప్రారంభమైంది. లాక్డౌన్ కారణంగా విద్యాసంస్థలు మూసివేయబడటంతో పాఠశాల , కళాశాల విద్యార్థుల కోసం వర్చువల్ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో తొమ్మిదవ తరగతి చదువుతున్న 14 ఏళ్ల దేవికా ఇంట్లో స్మార్ట్ ఫోన్ లేదు..

పైగా టీవీ పనిచేయడం లేదు.. తోటి విద్యార్థులందరూ ఆన్‌లైన్ తరగతులకు హాజరవుతుంటే దేవికా మాత్రం ఆ అవకాశం లేకపోవడంతో తరగతులు మిస్ అయింది. దీంతో కలత చెందిన దేవికా సోమవారం సాయంత్రం తన ఇంటి సమీపంలో తనను తాను నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సీనియర్ పోలీసు వర్గాలు తెలిపాయి. సోమవారం సాయంత్రం సమీపంలోని వాలంచెరియోన్ వద్ద ఈ సంఘటన జరిగింది.

Tags

Next Story