పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. ఎంతంటే..

ఇంధన మార్కెటింగ్ కంపెనీలు సిబ్సిడియేతర ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ రేట్లను పెంచాయి. ఢిల్లీలో 14.2 కిలోల సబ్సిడీ లేని సిలిండర్ ఎల్‌పిజి గ్యాస్ ధరను రూ.11.50 పెంచాయి.. దాంతో సిలిండర్ ధర రూ.593కు చేరింది. అలాగే కోల్‌కతా, ముంబై, చెన్నైలలో ఎల్‌పిజి ధర రూ. 584.50, రూ 579, రూ. 569.50గా ఉండగా.. వాటిని రూ. 616, రూ. 590.50, రూ. 606.50 లకు పెంచాయి. రూ.37 పెంపుతో చెన్నైలో అత్యధిక పెరుగుదల కనిపించింది.
అంతర్జాతీయ ధరల తగ్గుదలకు అనుగుణంగా వినియోగదారులందరికీ 2020 మే నెలలో ఢిల్లీ మార్కెట్లో ఎల్‌పిజి రిటైల్ అమ్మకం ధరను సిలిండర్‌కు రూ .744 నుంచి రూ. 581.50 కు తగ్గించినట్లు ఇండియన్ ఆయిల్ కార్ప్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇండియన్ ఆయిల్ కార్ప్ ప్రకారం దిల్లీలో ఏటీఎఫ్ ధరను రూ. 11,030.62 పెంచాయి. దాంతో ధర రూ. 33,575.48కు చేరింది. అలాగే కోల్‌కతాలో రూ. 38,543.48, ముంబయిలో రూ. 3,070.56, చెన్నైలో రూ. 34,569.30లుగా ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com