మ్యాచ్ పూర్తయిన తరువాత బంతిని..

మ్యాచ్ పూర్తయిన తరువాత బంతిని..
X

క్రికెట్ అభిమానులకు ప్రతిదీ ఆసక్తికర అంశమే. ఇంతకీ మ్యాచ్ పూర్తయిన తరువాత ఆడిన ఆ బంతిని ఏం చేస్తారో తెలుసా.. ఆ బంతితో బౌలర్ 5 లేదా 10 వికెట్లు తీసుకుంటే దాన్ని అతడు తీస్కెళ్లొచ్చు. అదే ఏదైనా స్పెషల్ మ్యాచ్ అయితే స్టేడియానికి చెందిన క్రికెట్ సంఘం ఆ బంతిని వేలం వేస్తుంది. లేకపోతే జ్ఞాపకంగా దాచి పెడుతుంది. సాధారణ మ్యాచ్‌ల్లో వినియోగించిన బంతులను నెట్స్‌లో ప్రాక్టీస్ కోసం వాడతారు. బంతి స్టేడియం బయటకు వెళ్లి కనిపించకుండా పోతే మరో పాత బాల్‌ని వినియోగిస్తారు. ఈ విషయంలో అంపైర్‌దే తుది నిర్ణయం. ఐపీఎల్‌లో అయితే ప్రచారం కోసం సూపర్ ఫ్యాన్ పేరుతో స్టేడియంలోని ఓ అభిమానికి బంతిని బహుమతిగా ఇస్తారు. క్రికెట్‌పై ఆసక్తి ఉన్నా.. ఆడేందుకు సరైన సౌకర్యాలు లేని క్రీడాకారులకు కొన్ని సార్లు బంతులను బహుమతిగా ఇస్తారు. మరి కొన్ని సార్లు పాత బంతులతో కొత్త బంతులు తయారు చేస్తారు.

Tags

Next Story