పుల్వామాలో మరో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్మూ కాశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్ జరిగింది. పుల్వామా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్ లో ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతం అయ్యారు. వారిలో ఒకరు జైష్ కమాండర్, అతను విదేశీయుడని భావిస్తున్నారు. అలాగే మరొక ఉగ్రవాది ఐఇడి పేలుడులో నిపుణుడుగా గుర్తించారు. పుల్వామా జిల్లాలో కంగన్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్టు భద్రతా దళాలకు సమాచారం అందింది. దాంతో జమ్మూ కాశ్మీర్ పోలీసుల సంయుక్త బృందం, భారత సైన్యానికి చెందిన 55 రాష్ట్రీయ రైఫిల్స్ , సిఆర్పిఎఫ్ 183 బెటాలియన్ సిబ్బంది కార్డన్-అండ్-సెర్చ్-ఆపరేషన్ ను ప్రారంభించాయి. ముందు జాగ్రత్తగా పుల్వామా జిల్లాలో మొబైల్ ఇంటర్నెట్ సేవ నిలిపివేశారు.
భద్రతా దళాలు కూడా ఉగ్రవాదులను లొంగిపోవాలని కోరినప్పటికీ ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. దీంతో బుధవారం తెల్లవారుజాము కల్లా బలగాలు ఉగ్రవాదులుంటున్న ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఈ క్రమంలో భద్రతా దళాలు ముగ్గురు ఉగ్రవాదులను ఎన్‌కౌంటర్ చేశాయి. వీరంతా జైష్-ఎ-మహ్మద్ లో చాలా చురుకుగా పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ ప్రాంతంలో ఇంకా ఉగ్రవాదులు ఉండే అవకాశం ఉందని ఆ ప్రాంతాన్నంతా జల్లెడ పడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

