మహారాష్ట్రలో మరో 47 మంది పోలీసు సిబ్బందికి కరోనా

మహారాష్ట్రలో కరోనా కేసులు మరోసారి పెరిగాయి.. కొత్తగా 2287 సంక్రమణ కేసులు నమోదయ్యాయి. 47 మంది పోలీసు సిబ్బంది COVID-19 కు పాజిటివ్ పరీక్షలు చేసినట్లు ANI నివేదించింది. మొత్తం సోకిన పోలీసు సిబ్బంది సంఖ్య 2,556 కు చేరుకుందని తెలిసింది. ఇక గత 24 గంటల్లో 1225 మంది కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అలాగే 103 మంది రోగులు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 72 వేల 300 మంది సోకినట్లు గుర్తించారు.
మే 26 నుండి మే 31 వరకు దేశంలోని మొత్తం కరోనా కేసులలో మహారాష్ట్ర వాటా 43% నుండి 35% కి పడిపోయింది. ఇదిలావుంటే దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 2 లక్షల 7 వేల 910 కు పెరిగింది. గత 24 గంటల్లో 8,909 కొత్త పాజిటివ్ కేసులు వచ్చినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం ఉదయం తెలిపింది. గత 24 గంటల్లో 8,909 కొత్త పాజిటివ్ కేసులు వచ్చినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

