జీతాలు రాకపోవడంతో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆందోళన..

X
By - TV5 Telugu |3 Jun 2020 8:25 PM IST
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు చెల్లించేది ఎప్పుడు. చాలా శాఖల్లో ఉద్యోగులకు ఇంకా వేతనాలు ఎందుకు పడలేదు. పెన్షనర్లకూ ఎదురుచూపులు ఎందుకు తప్పడం లేదు. ఈ అంశాలన్నీ తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. 3 తారీఖు వచ్చినా ఇంకా జీతాలు రాకపోవడం ఉద్యోగుల్లో ఆందోళనకు కారణమైంది. ప్రస్తుతం విడతల వారీగా ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నారు. సచివాలయ ఉద్యోగులకు ఇప్పటికే జీతాలు జమ అయినా.. హెచ్‌వోడీలు, జిల్లా స్థాయి అధికారులకు మాత్రం అందలేదు. ఈ పరిస్థితికి సాంకేతిక సమస్యలే కారణమని ఉన్నతాధికారులు చెప్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

