మరోసారి భేటీ కానున్న కేంద్రమంత్రివర్గం

మరోసారి భేటీ కానున్న కేంద్రమంత్రివర్గం
X

బుధవారం కేంద్ర క్యాబినెట్ భేటీ కానుంది. ఢిల్లీలోని 7 క‌ల్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నివాసంలో ఈ భేటీ జ‌రుగ‌నుంది. ఈ భేటీలో దేశంలో క‌రోనా ప‌రిస్థితి, ఆత్మనిర్భర భార‌త్ ప్యాకేజీలో కేటాయింపుల‌కు సంబంధించి ప్రధానంగా చ‌ర్చ జ‌రగనున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా భార‌త్‌-చైనా స‌రిహ‌ద్దుల్లో ప‌రిస్థితిపై కూడా ఈ క్యాబినెట్ భేటీలో చ‌ర్చించ‌నునున్నట్టు స‌మాచారం. దేశంలో క‌రోనా క‌ట్టడికి చ‌ర్యలు చేప‌డుతూనే, దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడం ఎలా అనే అంశంపై సుదీర్ఘంగా చర్చించున్నట్టు తెలుస్తోంది.

Tags

Next Story