ఏపీలో కొత్త‌గా 79 క‌రోనా కేసులు : 35 మంది..

ఏపీలో కొత్త‌గా 79 క‌రోనా కేసులు : 35 మంది..
X

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 79 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తాజా బులిటెన్ ‌లో వెల్లడించింది. అలాగే 35 మంది కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. మంగళవారం ఉదయం 9 గంటలనుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకూ మొత్తం 8,066 శాంపిల్స్ ను పరీక్షించారు.

దీంతో 79 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. తాజా కేసులతో ఏపీలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3279కి చేరింది. కరోనా కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 68 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు మొత్తం 2244 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 967 యాక్టీవ్ కేసులున్నాయి.

Tags

Next Story