నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కల దాడి

నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కల దాడి
X

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో దారుణం జరిగింది. పట్టణంలోని పోలీస్‌ లైన్‌ వీధిలో కుక్కలు రెచ్చిపోయాయి. నాలుగేళ్ల బాలుడిపై ఒక్కసారిగా దాడి చేశాయి. వీధి కుక్కల దాడిలో తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

బాలుడి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో.. కొడుకును ఇంట్లోనే ఉంచి అతని తల్లి నంద్యాలకు వెళ్లింది. దీంతో అర్థరాత్రి ఇంట్లో నుంచి బయటకు వచ్చిన బాలుడిపై.. మూకుమ్మడిగా దాడి చేసి ప్రాణాలు తీశాయి వీధి కుక్కలు. బాలుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.

Tags

Next Story