మలకపేట రిజర్వాయర్ పనులను సాగే తీరుపై కేటీఆర్ అసంతృప్తి

మలకపేట రిజర్వాయర్ పనులను సాగే తీరుపై కేటీఆర్ అసంతృప్తి
X

రాజన్న సిరిసిల్ల జిల్లా మలకపేట రిజర్వాయర్‌ పనులను అక్టోబర్‌ వరకు పూర్తి చేయాలని.. మంత్రి కేటీఆర్‌ అధికారులను ఆదేశించారు. కోనరావుపేట మండలంలోని మలకపేట రిజర్వాయర్‌ తొమ్మిదో ప్యాకేజీ పనులను మంత్రి పరిశీలించారు. టన్నెల్‌, రిజర్వాయర్‌ పనులు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు నెమ్మదిగా సాగడంపై అంసతృప్తి వ్యక్తం చేశారు. అటవీశాఖ, రెవెన్యూ శాఖల నుంచి ఇబ్బందులు తలెత్తితే.. జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకురావాలని సూచించారు. వచ్చే అక్టోబర్‌లో సీఎం కేసీఆర్‌ చేత రిజర్వాయర్‌ ప్రారంభించేలా పనులు పూర్తి చేయాలని కేటీఆర్‌ అధికారులను ఆదేశించారు.

Tags

Next Story