అంతర్జాతీయం

coronavirus : చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచిన మంత్రి

coronavirus : చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచిన మంత్రి
X

పాకిస్థాన్ లో కరోనా కాటుకు రాష్ట్ర మంత్రి ఒకరు బలయ్యారు. పాకిస్తాన్ సింధ్ ప్రావిన్స్‌ కు చెందిన మంత్రి హాజీ గులాం ముర్తాజా బలూచ్ గత నెలలో కరోనా ఇన్‌ఫెక్షన్‌ భారిన పడ్డారు. అయితే ఆయన ఆరోగ్యం విషమించడంతో మే 23 న కరాచీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలోని ఐసియుకు తరలించారు. అయితే చికిత్స పొందుతూ ముర్తాజా బలూచ్ మృతి చెందారని సింధ్ ప్రభుత్వం వెల్లడించింది. దాంతో సింధ్ ముఖ్యమంత్రి మురాద్ అలీ షా.. ముర్తాజా బలూచ్ మృతికి సంతాపం తెలిపారు.. ఈ సందర్బంగా ఆయన చాలా ధైర్యవంతుడు, మంచి వ్యక్తి అని.. అతని స్థానంలో మరొకరిని నియమించడం చాలా కష్టమైన పని అని అన్నారు.

ఇదిలావుంటే పాకిస్థాన్ లో కొత్తగా 4,132 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఇప్పటివరకు మొత్తం 80,4639 గా తేలాయి. అలాగే గత 24 గంటల్లో మొత్తం 67 మంది రోగులు మరణించారు, దాంతో మరణాల సంఖ్య 1,688 గా ఉంది. ఇక 28,923 మంది కోలుకున్నారని పాకిస్థాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనాకు సింధ్ ప్రావిన్స్ రాష్ట్రము ఎక్కువగా ప్రభావితమైంది. ఇక్కడే 31 వేలకు పైగా కేసులు నిర్ధారించబడ్డాయి. ఆ తరువాత పంజాబ్ 29,489, ఖైబర్-పఖ్తున్ఖ్వా 10,897, బలూచిస్తాన్ 4,747, ఇస్లామాబాద్ 3,188, గిల్గిట్-బాల్టిస్తాన్ 779 మరియు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లలో 289 కేసులున్నాయి.

Next Story

RELATED STORIES