సోనూసూద్‌కి ఓ మహిళ వెరైటీ ట్వీట్..

వలస కార్మికులను వారి స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేయడంతో పాటు తన సాయం కోరివచ్చిన ప్రతి ఒక్కరికీ చేయూతనందిస్తున్నాడు బాలీవుడ్ నటుడు సోనూసూద్. కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలిచేందుకు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న సోనూకి ఓ మహిళ విచిత్రంగా ట్వీట్ చేసింది. దానికి సోనూ కూడా ఫన్నీ రిప్లై ఇచ్చారు. ఆమె ఇలా ట్వీట్ చేశారు. జనతా కర్ఫ్యూ నుంచి లాక్డౌన్ 4.0 వరకు నా భర్తతోనే ఉంటున్నా. నా భర్తతో కలిసి ఉండలేను. దయచేసి నా భర్తనైనా వాళ్లింటికి పంపించండి.. లేదా నన్నైనా పుట్టింటికి పంపించండి అని కోరింది. దీనికి సోనూసూద్ ఫన్నీ పరిష్కారమొకటి చెప్పాడు. నా దగ్గర మంచి ఉపాయం ఉంది. మీరిద్దరినీ గోవా పంపిస్తాను. మీరేమంటారు.. అని సరదాగా సమాధానమిచ్చాడు.
I have a better plan .. let me send both of you to Goa😂 What say? https://t.co/XbYNFWWflK
— sonu sood (@SonuSood) May 31, 2020
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

