తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
X

అరేబియా సముద్రంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాబోయే రోజులలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో రెండు రోజుల పాటు పలు చోట్ల ఉరుములు, ఈదురు గాలులతో

కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. మహబూబ్‌ నగర్‌, వనపర్తి, నాగర్‌ కర్నూలు, గద్వాల , యాదాద్రి, వికారాబాద్‌, మెదక్‌, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా రాబోయే 24 గంటల్లో రాయలసీమ, కోస్తాలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విజయవాడ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే ఉత్తర కోస్తా, రాయలసీమల్లో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. మరో రెండురోజులు ఇదే వాతావరణం ఉంటుందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.

Tags

Next Story