సీఎస్‌ నీలం సాహ్ని పదవీ కాలం పొడిగింపు

సీఎస్‌ నీలం సాహ్ని పదవీ కాలం పొడిగింపు
X

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) నీలం సాహ్ని పదవీకాలాన్ని మరో మూడు నెలలు పొడిగించింది ప్రభుత్వం. దీంతో సీఎస్ గా నీలం సాహ్ని మరో మూడు నెలలు కొనసాగనున్నారు. సీఎస్‌ పదవీకాలం పొడిగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. కరోనా నేపథ్యంలో సీఎస్‌ విధులు కీలకమైనందున పదవీ కాలం పొడిగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. దాంతో రాష్ట్రప్రభుత్వ ప్రతిపాదనను కేంద్రం ఆమోదించింది.. ఈ మేరకు ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 వరకూ నీలం సాహ్ని పదవీ కాలాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కేంద్ర ఆదేశాల మేరకు అప్పటిదాకా సీఎస్‌ సర్వీస్‌లో కొనసాగనున్నారు నీలం సాహ్ని.

Tags

Next Story