డాక్టర్ సుధాకర్‌పై నమోదైన కేసులను టేకప్ చేసిన సీబీఐ

సంచలనం సృష్టించిన డాక్టర్ సుధాకర్ కేసులో మరో ట్విస్ట్. ఆయనపై 3 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది సీబీఐ. 353, 427, 506 సెక్షన్ల కింద CBI అధికారులు F.I.R నమోదు చేశారు. సీబీఐ వెబ్‌సైట్‌లో F.I.R కాపీని అందుబాటులో ఉంచారు. కానిస్టేబుల్ బెలగల వెంకటరమణ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు.. విధులకు ఆటంకం కలిగించారనే అంశంపై కేసులు నమోదు చేశారు. అయితే దీనిపై సీబీఐ ఎస్పీ విమలాదిత్య వివరణ ఇచ్చారు. డాక్టర్ సుధాకర్‌పై కొత్తగా ఎలాంటి కేసు నమోదు చేయలేదని.. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు.. స్థానిక పోలీస్‌స్టేషన్లో గతంలో నమోదు చేసిన కేసును మాత్రమే టేక్‌ఓవర్ చేశామని తెలిపారు.
మాస్కుల కొరతపై ప్రభుత్వాన్ని నిలదీసినందుకు నర్సీంపట్నం ఏరియా ఆస్పత్రిలో అనస్థీషియన్‌గా పనిచేస్తున్న డాక్టర్ సుధాకర్‌ను సస్పెండ్ చేసింది ప్రభుత్వం. అయితే మే 16న ఆయన విశాఖపట్నంలోని తాటిచెట్లపాలెం పోర్టు హాస్పిటల్ ఎదురుగా నడిరోడ్డుపై అర్ధ నగ్నంగా కనిపించడం సంచలనం సృష్టించింది. ఆయన్ను అరెస్ట్ చేసే క్రమంలో పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత వివాదాస్పదమైంది. దుస్తులు ఊడదీసి అర్ధనగ్నంగా చేసి, తాళ్లతో చేతులను వెనక్కివిరిచి కట్టడం కలకలం రేపింది. ఈ ఘటన తీవ్ర దుమారం రేపడంతో సీబీఐ విచారణకు ఆదేశించింది హైకోర్టు. న్యాయస్థానం ఆదేశాల మేరకు కొన్ని రోజులుగా ఈ ఘటనపై విచారణ జరుపుతోంది సీబీఐ. ఇప్పటికే సుధాకర్ సహా కుటుంబ సభ్యులు, ట్రీట్‌మెంట్ చేసిన KGH వైద్యులు, 4వ పట్టణ పోలీసు సిబ్బందిని ప్రశ్నించారు అధికారులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

