కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్ పేరు మార్చేందుకు కేంద్రం నిర్ణయం

పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్ పేరును శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ట్రస్టుగా మార్చాలని కేంద్రం నిర్ణయించింది. బుధవారం కేంద్ర కేబినేట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ విషయాలు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేవకర్ మీడియా ముందు ప్రకటించారు. గత జనవరి నుంచి ఈ పేరును మార్చాలనే అంశం ప్రస్థావనకు వచ్చినా.. ఇప్పుడు దానిపై ఒక నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇంకా ఈరోజు మంత్రి వర్గ సమావేషంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.

రైతులు ఇకపై తమ పంటలను దేశంలో ఎక్కడైనా అమ్ముకునేలా అనుమతినిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఏ రాష్ట్ర రైతు అయినా తమ పంటకు ఎక్కడ ఎక్కువ ధర లభిస్తే అక్కడ అమ్ముకునే స్వేచ్ఛ లభిస్తుంది. రైతులకు మేలు చేసేందుకు నిత్యావసరాల చట్టాన్ని సవరించాలని కూడా నిర్ణయించింది.

Tags

Next Story