క్వారంటైన్‌ సెంటర్‌లో భార్యాభర్తల గొడవ.. భర్త ఆత్మహత్యాయత్నం

క్వారంటైన్‌ సెంటర్‌లో భార్యాభర్తల గొడవ.. భర్త ఆత్మహత్యాయత్నం
X

కర్నూలు జిల్లా కోసిగి క్వారంటైన్ సెంటర్‌లో ఉన్న భార్యా భర్తలు ఇద్దరూ గొడవ పడ్డారు. కారణం ఏమో గానీ చిన్నగా మొదలైన ఆ గొడవ కాస్తా పెద్దదైంది. చుట్టూ ఉన్నవాళ్లు తమనే చూస్తున్నారన్నజ్ఞానం కూడా లేకుండా అరుచుకున్నారు. దీన్ని అవమానంగా భావించిన భర్త మనస్థాపానికి గురై ఆత్మహత్యకు ప్రయత్నించాడు. క్వారంటైన్ సెంటర్లోనే ఉరివేసుకున్నాడు. అతడిని గమనించిన సెంటర్లోని మిగిలిన వారు క్వారంటైన్ సిబ్బందికి సమాచారం అందించారు. దాంతో హుటాహుటిన అతడిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని అక్కడి నుంచి ఆదోని ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు.

Tags

Next Story