షాకింగ్: ఏసీ పైపులో 40 పాము పిల్లలు

షాకింగ్: ఏసీ పైపులో 40 పాము పిల్లలు
X

ఉత్తరప్రదేశ్ లో షాకింగ్ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇంట్లో ఉన్న ఎయిర్ కండిషనర్(ఏసీ) పైపులోకి ఏకంగా 40 పాము పిల్లలు చేరాయి. ఈ ఉదంతం మీరట్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. కంకర్‌ఖేరా పోలీసు స్టేషన్ పరిధిలోని పావ్లీ ఖుర్ద్ గ్రామానికి చెందిన రైతు శ్రద్ధానంద్ తన ఇంట్లో ఫ్లోర్ మీద పాకుతున్న పాము పిల్లను ఒకదాన్ని చూశారు. దాంతో సాధారణంగానే ఆ పాము పిల్ల ఇంట్లోకి వచ్చి ఉంటుందనుకొని వెంటనే దానిని బయట వదిలేసి వచ్చారు. అలా వెళ్లి ఇలా ఇంట్లోకి రాగానే మంచం మీద మరో మూడు పాము పిల్లల్ని చూసి ఖంగు తిన్నాడు. అటు ఇటు తేరిపారా చూసి ఈ పాములు ఎక్కడినుంచి వస్తున్నాయబ్బా అని ఆశ్చర్యపడేలోపే ఏసీ పైపులోనుంచి మరికొన్ని పాము పిల్లలు జారడం చూశాడు..

దాంతో భయాందోళన చెందిన శ్రద్ధానంద్ వెంటనే కుటుంబసభ్యుల్ని పిలిచి వారి సహాయంతో ఏసీని పూర్తిగా తెరిచి చూశాడు. అంతే.. పైపులో పదుల సంఖ్యలో పాములు దర్శనమిచ్చాయి.. మొత్తం 40 ఉన్నాయి. అయితే వాటన్నింటిని కదిలిస్తే పారిపోతాయోమోనని గ్రహించి వెంటనే ఏసీ పైపును కోసి బయటికి తెచ్చారు. ఆ తరువాత పాములను అన్నింటిని తీసి ఒక గొనె సంచిలో వేసి దగ్గరలో ఉన్న అడవిలో వదిలేసి వచ్చాడు. అయితే. గత కొన్ని నెలలుగా ఆ ఏసీ వాడని కారణంగా ఒక పాము పైపులో దూరి గుడ్లు పెట్టి ఉండవచ్చని.. ఈ క్రమంలోనే పాము పిల్లలు వచ్చాయని స్థానిక పశు వైద్యుడు డాక్టర్ ఆర్కె వత్సల్ అభిప్రాయపడ్డారు.

Tags

Next Story