జూన్ 8 నుంచి మాల్స్ ఓపెన్.. నో డిస్కౌంట్..

జూన్ 8 నుంచి మాల్స్ ఓపెన్.. నో డిస్కౌంట్..
X

డిస్కౌంట్ సేల్ పెట్టి ఉన్నసరుకంతా క్లియర్ చేద్దామంటే కరోనా వైరస్ కిటికీ పక్కనే ఉండి చూస్తోంది. వైరస్ వ్యాప్తి చేయడానికి అవకాశం కోసం ఎదురు చూస్తోంది. అందుకే మరోమాట లేకుండా కామ్‌గా ఉన్న సరుకు అమ్ముకోవాలనుకుంటున్నాం. జూన్ 8 నుంచి మాల్స్ ఓపెన్ అవుతుండడంతో వినియోగదారులు డిస్కౌంట్లేమైనా ప్రకటిస్తాయేమోనని ఎదురు చూస్తుండవచ్చు. కానీ అలాంటిది ఏమీ లేదని చెబుతున్నారు మాల్స్ నిర్వాహకులు. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి మాల్స్ తెరుచుకుంటున్నాయి.

డిస్కౌంట్లు పెడితే జనం భారీగా వస్తారు. కట్టడి చేయడం కష్టమైపోతుంది. భౌతిక దూరం, ఇతర భద్రతా చర్యలు పాటించడం వంటివి సవాల్‌తో కూడుకున్నవి. అన్ని చర్యలు తీసుకుంటూ అమ్మకాలు సాగించాలి. ఇలాంటి పరిస్థితిలో ఆశకు పోవడం సరికాదు. డిస్కౌంట్ కంటే ముఖ్యం సురక్షితంగా షాపింగ్ చేయడం అని ఫ్యూచర్ రిటైల్ ఎండీ రాకేశ్ బియానీ అన్నారు. మరోవైపు కొన్ని మాల్స్ ప్యాండమిక్ రెస్పాన్స్ టీమ్, ఐసోలేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాయి. భార్య భర్తలు వచ్చినా భౌతిక దూరం పాటిస్తూ షాపింగ్ చేయాల్సి ఉంటుంది.

Tags

Next Story