అనంతపురం ఎంపీకి ప్రధాని మోదీ ప్రత్యేక లేఖ

అనంతపురం పార్లమెంట్ సభ్యుడు తలారి రంగయ్యకు ప్రధాని నరేంద్ర మోదీ నుంచి లేఖ వచింది. తలారి రంగయ్య జన్మదినం సందర్భంగా మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎంపీకి లేఖను పంపారు. అందులో ఇలా పేర్కొన్నారు. 'మీ పుట్టినరోజు నాడు నా సాదర శుభాకాంక్షలు స్వీకరించండి. ఈ సందర్భంగా మీకు దీర్జాయుష్ష్ణు మంచి ఆరోగ్యం లభించాలని ఆకాంక్షిస్తున్నాను. మీ జీవితంలో సుఖం, కాంతి, సమృద్ధి నిండాలన్న ఆకాంక్షతో మీకు మరోసారి జన్మదిన శుభాకాంక్షలు.
సమాజహితం కోసం మీరు చేసే పనివలన మీ జీవితం కీర్తిమయం కావాలని, అనుభవం, నాయకత్వ పటిమతో దేశాన్ని కొత్త శిఖరాలను అధిరోహించేలా చేయాలని ఈశ్వరుడిని ప్రార్థిస్తున్నా' అని లేఖలో ప్రధాని పేర్కొన్నారు. కాగా ప్రభుత్వ అధికారిగా ఉన్న తలారి రంగయ్య వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని గత ఎన్నికల్లో వైసీపీ తరుఫున పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com