వేధింపులు భరించలేక రైల్వే ఉద్యోగి ఆత్మహత్య

ఉన్నతాధికారుల వేధింపులు తాళలేక... రైల్వే కీ మెన్ ఆత్మహత్య చేసుకున్న ఘటన... కృష్ణా జిల్లా జి.కొండూరులో జరిగింది. తాను ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాడో... సెల్ఫీ వీడియో తీసుకుని చనిపోయాడు పెయ్యాల రాజు. రైల్వే ట్రాక్ సమీపంలో కూల్‌డ్రింక్‌లో పురుగులు మందుకు కలుపుకుని తాగుతూ సెల్ఫీ వీడియో తీశాడు.
ఇబ్రహీంపట్నం రాయనపాడు గ్రామానికి చెందిన పెయ్యాల రాజు... రైల్వేలో కీమెన్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. 28 గ్రేడ్ ఉద్యోగిగా గుర్తింపు ఉండి.. గ్యాంగ్ మెన్ అయ్యే అవకాశం ఉన్నా... రాజకీయాలు చేసి అణచివేశారన్నది పెయ్యాల రోజు ఆరోపణ. గతంలోనూ ప్రమోషన్ ఇవ్వకుండా నిలిపివేశారు. చెరువు మాధవరం రైల్వే స్టేషన్ నుంచి ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం స్టేషన్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు. అయినా అధికారుల వేధింపులు ఆగలేదని పెయ్యాల రాజు పురుగుల మందు తాగాడు. ఆ తర్వాత బైక్‌పై ఇంటికివెళ్లి విషయం చెప్పాడు. ఆందోళనపడ్డ బంధువులు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా... చికిత్స పొందుతూ చనిపోయాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com