స్కూల్ సెక్యూరిటీ గార్డ్ 37 మంది పిల్లలపై దాడి ..

స్కూల్ సెక్యూరిటీ గార్డ్ 37 మంది పిల్లలపై దాడి ..

చైనాలోని గ్వాంగ్జీ రీజియన్‌లో ఓ విషాదం చోటు చేసుకుంది. స్కూల్లో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న ఓ వ్యక్తి 37 మంది పిల్లలపై కత్తితో దాడి చేసాడు. దాడిని అడ్డుకున్న ఇద్దరు టీచర్లపై కూడా దాడి చేశాడు. అతడు ఎందుకు ఇంత ఉన్మాదంగా ప్రవర్తిస్తున్నాడో అర్థం కాని టీచర్లు జరుగుతున్న సంఘటన చూసి భయభ్రాంతులకు గురయ్యారు. మిన్నంటేలా ఆర్తనాదాలు చేశారు. వాంగ్‌ఫూ సెంట్రల్ ప్రైమరీ స్కూలు విద్యార్థులు గురువారం ఉదయం 8.30కు స్కూలుకు వచ్చారు. విద్యార్థులు వచ్చిన కాసేపటికే దాడి జరిగినట్లు అధికారులు గుర్తించారు.

అదృష్టవశాత్తు ఈ దాడిలో విద్యార్థులకు స్వల్ప గాయాలే అయ్యాయని ప్రాణాపాయ స్థితిలో లేరని వైద్యులు వివరించారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన స్కూలుకు చేరుకుని సెక్యూరిటీ గార్డుని అదుపులోకి తీసుకున్నారు. 50ఏళ్ల వయసున్న ఆ నిందితుడు ఈ దారుణానికి ఎందుకు పాల్పడ్డాడు అనేదానిపై పోలీసులు విచారిస్తున్నారు. ఇలాంటి సంఘటనలో చైనాలో తరచుగా పునరావృతమవుతూనే ఉంటాయి. కాగా, లాక్డౌన్ తరువాత స్కూల్ తెరుచుకున్న వెంటనే ఇలా జరగడం తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story