మరో వారంలో మార్కెట్లోకి కొత్త బైకులు..

మరో వారంలో మార్కెట్లోకి కొత్త బైకులు..
X

కరోనా వచ్చింది.. ఆర్థిక రంగాన్ని అతలాకుతలం చేసింది. అన్ని రంగాలు దాదాపు రెండు నెలల లాక్డౌన్‌తో కోలుకోలేని పరిస్థితిలో ఉన్నాయి. గాడిన పడేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. అత్యధిక నష్టాన్ని చవిచూసిన ఆటోమొబైల్ రంగం మార్కెట్లోకి తీసుకువచ్చే కొత్త ఉత్పత్తులను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆటోఎక్స్‌పో కూడా రద్దయింది. జూన్ 8 నుంచి షోరూంలు తెరుచుకునేందుకు అనుమతులు రావడంతో కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేసేందుకు తయారీదారులు సిద్దమయ్యారు. మరి అవేంటో ఒకసారి చూద్దాం..

ట్రయాంప్ బొన్నెవిల్లే టీ 100 బ్లాక్, టీ 120 బ్లాక్.. సాధారణ టీ 100, టీ 120 మోడల్స్‌కు అదనపు ఆకర్షణగా ఈ బ్లాక్ ఎడిషన్ బైక్‌లను మార్కెట్లోకి తీసుకురానున్నారు. వీటికి అమర్చిన ఇంజన్ కెపాసిటీ 900సీసీ పార్లల్ ట్విన్, 1200సీసీ పార్లల్ ట్విన్. వీటి ఎక్స్ షోరూమ్ ధర రూ.9 నుంచి 10 లక్షలుగా ఉంది.

టీవీఎస్ విక్టర్.. టీవీఎస్ సంస్థ తన అన్ని మోడల్స్‌ను బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేసుకుంటూ వస్తుంది. అందులో భాగంగా టీవీఎస్ విక్టర్ 110 మోడల్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది. 110 సీసీ, సింగిల్ సిలిండర్ ఇంజన్‌తో వస్తుంది. ధర వచ్చి రూ.60,000 నుంచి రూ.80,000 మధ్య ఉండొచ్చని అంచనా.

కవాసకీ జెడ్ 900.. జపనీస్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కవాసకీ జెడ్ 900 కొత్త బైక్‌ను విడుదల చేస్తుంది. 948 సీసీ ఇంజన్ అమర్చారు. ధర రూ.8.5 లక్షలు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ మెటోర్ 350.. గతంలో ఉన్న థండర్ బర్డ్ 350 మోడల్‌కి బదులు దీనిని తీసుకు వస్తున్నారు. 350 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉన్న దీని ధర రూ.1.70 లక్షలు.

ట్రయాంప్ టైగర్ 900.. బ్రిటన్ చెందిన సంస్థ ట్రయాంప్ టైగర్ 900 మోడల్ అడ్వెంచర్ బైక్‌ను విడుదల చేస్తుంది. దీని ధర రూ.16 లక్షల నుంచి రూ.17 లక్షల మధ్య ఉండొచ్చు.

హీరో ఎక్స్‌ట్రీమ్ 160 ఆర్.. హీరో మోటార్ కార్స్ త్వరలో హీరో ఎక్స్ట్‌ట్రీమ్ 160 ఆర పేరుతో కొత్త మోడల్‌ను తీసుకువస్తోంది. ధర రూ.లక్ష వరకు ఉండొచ్చు. ఇంజన్ కెపాసిటీ 160 సీసీ.

యమహా ఎఫ్‌జెడ్ 25.. సరి కొత్త హంగులతో యమహా మార్కెట్లోకి వస్తుంది. బీఎస్-6 250సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను అమర్చారు. ధర బీఎస్ 4 మోడల్ కంటే కొంచెం ఎక్కువే ఉంటుందని మార్కెట్ వర్గాల సమాచారం.

Tags

Next Story