విశాఖ వాసులకు ఉపశమనం.. వైజాగ్‌లో భారీ వర్షం..

విశాఖ వాసులకు ఉపశమనం.. వైజాగ్‌లో భారీ వర్షం..
X

మూడు నెలలుగా విపరీతమైన ఎండ, ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అయిన విశాఖ వాసులకు వర్షం ఉపశమనం కలిగించింది. గురువారం విశాఖపట్నం నగరంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో వాతావరణం చల్లబడటంతో నగర వాసులకు వడగాల్పుల నుంచి ఊరట లభించింది. మరోవైపు తూర్పు మధ్య అరేబియాలో కొనసాగుతున్న నిసర్గ్‌ తుఫాన్‌ ప్రభావంతో ఉత్తర కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిమీ వేగంతో ఈదురుగాలులు,

ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. నాలుగు రోజుల కిందట నైరుతి రుతు పవనాలు కేరళ తీరాన్ని తాకాయి.. ఇవి చురుగ్గా కదులుతూ కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు విస్తరించాయని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Tags

Next Story