రజనీకాంత్ కు కరోనా పాజిటివ్ అంటూ నటుడు పోస్ట్.. చివరకు చూస్తే..

రజనీకాంత్ కు కరోనా పాజిటివ్ అంటూ నటుడు పోస్ట్.. చివరకు చూస్తే..

సూపర్ స్టార్ రజనీకాంత్ కు కరోనా పాజిటివ్ వచ్చిందని నటుడు రోహిత్ రాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.. దాంతో రజిని అభిమానులు తీవ్ర ఆందోళన చెందారు. అయితే ఇది నిజం కాదని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దాంతో ఈ పోస్టు చేసిన రోహిత్ రాయ్ పై రజిని అభిమానులు భారీగా ట్రోల్ చేస్తున్నారు. కాగా న‌టుడు రోహిత్ రాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో "ర‌జ‌నీకాంత్‌కు క‌రోనా పాజిటివ్ అని తేలింది. కానీ క‌రోనా క్వారంటైన్‌లో ఉంది" అని పోస్ట్ పెట్టాడు.

దాంతో ఈ పోస్టును చూసిన అభిమానులు ఖంగారుతో వెబ్సైట్లలో న్యూస్ వెతకడం ప్రారంభించారు. అయితే ఎక్కడా దీనికి సంబంధించిన వార్త రాలేదు.. దాంతో నెటిజ‌న్లు అది జోక్ అని తెలుసుకొని రోహిత్ రాయ్ ను తిట్టిపోస్తున్నారు. 'జోక్ పరమ చెత్త‌గా ఉంది', 'ఇలాంటి జోక్ భార‌తీయ సంస్కృతి కాదు', 'క‌రోనా కామెడీ కాదు, ఇటువంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దంటూ హితవు పలికారు.

Tags

Read MoreRead Less
Next Story