బెజవాడ గ్యాంగ్‌వార్ కీలక సూత్రధారిగా సోనాలిక ట్రాక్టర్ డీలర్

బెజవాడ గ్యాంగ్‌వార్ కీలక సూత్రధారిగా సోనాలిక ట్రాక్టర్ డీలర్
X

విజయవాడ గ్యాంగ్‌వార్‌ కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. గ్యాంగ్‌వార్‌లో సోనాలిక ట్రాక్టర్ డీలర్ నాగబాబును ప్రధాన సూత్రధారిగా పోలీసులు గుర్తించారు. పెనమలూరు నియోజకవర్గం పోలీస్ స్టేషన్‌ పరిధిలో నాగబాబు చెప్తే జరగని పనిఉండదని పోలీసుల విచారణలో తేలింది. అపార్ట్‌మెంట్ పంచాయితీకి శ్రీధర్‌, ప్రదీప్‌ రెడ్డితో సిట్టింగ్‌ ముహూర్తాన్ని నాగబాబే ఫిక్స్‌ చేసినట్టు తేల్చారు. పేకాటలో పరిచయమైన సందీప్‌ను సెటిల్మెంట్‌కి వాడుకోవాలని నాగబాబు నిర్ణయించుకున్నాడు.

తనతోపాటు సందీప్‌కి చెందిన కామన్ ఫ్రెండ్ స్థలంలో సిట్టింగ్‌ ఏర్పాటు చేశాడు నాగబాబు. ప్రదీప్‌ వద్ద గుమాస్తాగా పనిచేస్తున్న స్నేహితుడికి పండుతో పరిచయం ఉన్నట్టు తేలింది. అపార్ట్‌మెంట్ సెటిల్మెంట్‌ జరుగుతున్న ప్రదేశానికి పండు నేరుగా వెళ్లాడు. కాసేపటికి అక్కడికి సందీప్ చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో సందీప్‌, పండు మధ్య మాటామాటా పెరిగింది. పండు.. .సందీప్‌ కాలర్ పట్టుకున్నాక... ఇద్దరి మధ్య విభేదాలు పెరిగాయి. సందీప్ తన అనచురుల్ని పండు ఇంటికి పంపడంతో గొడవ పెద్దదైంది. దీంతో సందీప్‌ను చంపిన తర్వాత ఇంటికి రా అంటూ... కొడుకుని పండు తల్లి రెచ్చగొట్టినట్టు సమాచారం.

తరుచుగా గొడవలు జరుగుతుండటంతో... ముందస్తుగా... కొడుకు మతిస్థిమితం సరిగ్గా లేదంటూ.. .పండు తల్లి డాక్టర్ సర్టిఫికెట్ కూడా తీసుకుంది. గంజాయి అమ్మేవాళ్లను కూడా.. గ్యాంగ్‌ వార్‌లో పాల్గొనేలా పండు సెట్ చేశాడు. వన్‌టౌన్‌, తాడేపల్లి, మంగళగిరి బ్యాచ్‌ గ్యాంగ్‌వార్‌లో పాల్గొన్నట్టు పోలీసులు గుర్తించారు. పండుకు ముగ్గురు రౌడీ షీటర్లు కూడా సపోర్ట్‌ చేసినట్టు తెలుస్తోంది. గ్యాంగ్‌వార్ టైమ్‌లో ఫుల్లుగా గంజాయి మత్తులో ఉన్నారు ముఠా సభ్యులు. గ్యాంగ్‌వార్‌లో కీలక పాత్ర పోషించిన వారిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తుండటంతో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Tags

Next Story