కర్ణాటకలో ఉత్కంఠగా రాజ్యసభ పోరు.. నాలుగో అభ్యర్థి ఆయనేనా?

కర్ణాటకలో ఉత్కంఠగా రాజ్యసభ పోరు.. నాలుగో అభ్యర్థి ఆయనేనా?
X

కర్ణాటకలో రాజ్యసభ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.. ఎనాలుగు స్థానాలకు ఈ నెల 19న ఎన్నికలు జరగనున్నాయి. 224 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో ఒక్కో స్థానంలో గెలిపించుకునేందుకు 44 మంది సభ్యులు మద్దతు అవసరం అవుతారు. అయితే సంఖ్యాబలం పరంగా 117 స్థానాలున్న బీజేపీ రెండు రాజ్యసభ స్థానాలను సునాయాసంగా దక్కించుకుంటుంది. ఇక మిగిలిన రెండు స్థానాలు ప్రతిపక్షాలకు దక్కే అవకాశం ఉంది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కు ప్రస్తుతం 68 మంది సభ్యుల బలం ఉంది. అలాగే జేడీఎస్ కు 34 మంది ఎమ్మెల్యేలున్నారు. అయితే కాంగ్రెస్ కు ఈజీగా ఒక స్థానం దక్కుతుంది. దాంతో సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గేను రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్ ఖరారు చేసింది. నాలుగో సీటుపై కాంగ్రెస్ మిత్రపక్షం జేడీఎస్ కన్నేసింది. కానీ జేడీఎస్ కు మాత్రం మరో 10 మంది ఎమ్మెల్యేల అవసరం అవుతారు.

ఈ క్రమంలో కాంగ్రెస్‌-జేడీఎస్‌ జట్టు కట్టి ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ప్రధాని, జేడీఎస్‌ అధినేత దేవెగౌడను బరిలో దింపాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించి దేవెగౌడ కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సైతం సానుకూలంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది.. ఇప్పుడున్న పరిస్థితులలో దేవెగౌడ రాజ్యసభ అభ్యర్థి అయితేనే బాగుంటుందని మిత్రపక్షాల నేతలు సైతం భావిస్తున్నారట.. కానీ వృద్ధాప్యం దృష్ట్యా రాజకీయాలకు దూరంగా ఉండాలని దేవెగౌడ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి అందరూ కలిసి దేవెగౌడ ను ఒప్పిస్తారో లేక మరో నేతకు అవకాశం కల్పిస్తారో అనేది ఉత్కంఠంగా మారింది. మరోవైపు ఎన్నికల వేళ సభ్యులు జారిపోకుండా అన్ని పార్టీలు జాగ్రత్త పడుతున్నాయి.

Tags

Next Story