కరోనాకి తోడు డెంగ్యూ.. విద్యార్థిని మృతి

వచ్చేది వర్షాకాలం.. ఇంకెన్ని అంటు వ్యాధులను మోసుకొస్తుందో అని అధికారులు కంగారు పడుతూనే ఉన్నారు. అంతలోనే డెంగ్యూ రానేవచ్చింది. ఓ విద్యార్థిని కబళించి మృత్యుఒడికి చేర్చింది. కరోనాని కట్టడి చేయలేక సతమతమవుతున్న ప్రభుత్వాన్ని డెంగీ రూపంలో మరో ప్రమాదం ముంచుకొస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తిలో డెంగీ భారిన పడి ఐఐటీ విద్యార్థిని దీక్షిత మృతి చెందింది. అమరచింతకు చెందిన దీక్షిత ఐఐటీలో జాతీయ స్థాయిలో 241వ ర్యాంకు సాధించి వారణాసిలో ఐఐటీ మొదటి సంవత్సరం చదువుతోంది. తండ్రి సీత్యానాయక్ హైద్రాబాద్ లో ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తున్నారు. తన కూతురు చదువుల తల్లి సరస్వతి అని దీక్షిత మృతదేహాన్నిచూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. దీక్షిత డెంగీతో మృతి చెందడం గ్రామస్తులను కలచివేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com