'కేఫ్ కాఫీ డే' వీజీ సిద్ధార్థ కుమారుడితో డీకే ఐశ్వర్య వివాహం!

మాజీ మంత్రి, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కుమార్తె ఐశ్వర్యను కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకులు, దివంగత వీజీ సిద్ధార్థ కుమారుడు అమర్త్య హెగ్డేకు ఇచ్చి వివాహం జరిపించాలని పెద్దలు నిర్ణయించారు. అమెరికాలో ఉన్నత చదువులు చదివిన అమర్త్య హెగ్డే ప్రస్తుతం కేఫ్ కాఫీ డే బిజినెస్ వ్యవహారాలు చూస్తున్నారు. ఇక డీకే శివకుమార్ ప్రధమ పుత్రిక అయిన ఐశ్వర్య (22) బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసి వ్యాపారాలు చూస్తున్నారు.. అంతేకాదు బెంగళూరులోని శివకుమార్ యాజమాన్యంలోని గ్లోబల్ అకాడమీ ఆఫ్ టెక్నాలజీలో ట్రస్టీ గా ఉన్నారు.
మనీలాండరింగ్ ఆరోపణలపై డీకే శివకుమార్ తిహార్ జైలులో సుమారు 50 రోజులు ఉన్నప్పుడు సెప్టెంబరులో ఆమెను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)విచారించింది. కాగా వీరిద్దరి వివాహంపై చర్చించేందుకు గాను గత ఆదివారం సిద్ధార్థ ఇంటికి శివకుమార్శి కుటుంబ సభ్యులు వెళ్లినట్టు తెలుస్తోంది. ఇదిలావుంటే కర్ణాటక మాజీ సీఎం ఎస్‌ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్ధార్థ 2019 జూలైలో మంగళూరులోని నేత్రావతి నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com