బ్రేకింగ్.. డాక్టర్ సుధాకర్ విడుదలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

బ్రేకింగ్.. డాక్టర్ సుధాకర్ విడుదలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
X

డాక్టర్ సుధాకర్ కేసులో ఎట్టకేలకు ఆయన కాస్త ఊరట దొరికే ఆదేశాలు వెలువడ్డాయి. ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు సమాచారం ఇచ్చి సుధాకర్ తన‌ ఇంటికి వెళ్లొచ్చని హైకోర్టు సూచించింది. సుధాకర్ తల్లి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఇంటికి వెళ్లినా సుధాకర్ CBI విచారణకు సహకరించాలని స్పష్టం చేసింది. గత నెల 16న సుధాకర్‌ను విశాఖ 4వ పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి నాటకీయ పరిణామాలు జరిగాయి. ఆయన్ను KGH నుంచి మానసిక వైద్యశాలకు తరలించడం ఆపై కేసు CBIకి అప్పగించడం లాంటి పరిణాలాన్నీ ట్విస్టుల మీద ట్విస్ట్‌లతోనే సాగింది. మానసిక వైద్య శాలలో ఆయనకు అందిస్తున్న వైద్యంపై కుటుంబ సభ్యులు, సుధాకర్ అనేక సందేహాలు లెవనెత్తారు. కనీసం ఆయన్ను అక్కడి నుంచి మరో ఆస్పత్రికైనా తరలించాలని కోరారు. చివరికిప్పుడు డాక్టర్ సుధాకర్‌ ఇంటికి వెళ్లొచ్చంటూ కోర్టు స్పష్టం చేయడంతో కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Next Story